Sunday, July 27, 2025
E-PAPER
Homeజాతీయం2 వేల కిలోల బంగారం అదృశ్యం..

2 వేల కిలోల బంగారం అదృశ్యం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేవనాథన్‌ యాదవ్‌ ఆస్తి జాబితాలో 2 వేల కిలోల బంగారం అదృశ్యమైనట్లు మద్రాసు హైకోర్టులో ఆరోపణలు చేశారు. మైలాపూర్‌లో ఉన్న మైలాపూర్‌ హిందూ పర్మినెంట్‌ ఫండ్‌ ఫైనాన్స్‌ సంస్థలో పెట్టుబడి పెట్టిన వందమందికి పైగా పెట్టుబడిదారుల వద్ద రూ.కోట్లు మోసం చేసినట్లు ఆ సంస్థ డైరక్టరు దేవనాథన్‌ యాదవ్‌ తదితర ఆరుగురిని ఆర్థికనేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. దేవనాథన్‌ యాదవ్, మరో ఇద్దరు బెయిల్‌ కోరి మూడోసారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చింది. బాధితుల తరఫున.. దేవనాథన్‌ యాదవ్‌కు 2 వేల కిలోల బంగారం ఉందని అభియోగపత్రంలో తెలిపారని, ప్రస్తుతం దాఖలు చేసిన ఆస్తి జాబితాలో ఆ బంగారం అకస్మాత్తుగా అదృశ్యమైందని తెలిపారు. ఆ 2 వేల కిలోల బంగారం ఉంటేనే బాధితులకు వడ్డీతో తిరిగి ఇవ్వగలరని చెప్పారు. విచారణ జరిపిన న్యాయమూర్తి బెయిల్‌ పిటిషన్‌పై పోలీసులు జవాబివ్వాలని తెలిపి విచారణ ఆగస్టు 1కి వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -