Saturday, December 13, 2025
E-PAPER
Homeజాతీయం2001లో పార్ల‌మెంట్‌పై ఉగ్ర‌దాడి..మృతులకు నివాళి

2001లో పార్ల‌మెంట్‌పై ఉగ్ర‌దాడి..మృతులకు నివాళి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: డిసెంబర్‌ 13, 2001వ సంవత్సరంలో పార్లమెంటుపై దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు సెక్యూరిటీ సిబ్బంది, ఒక పౌరుడితో సహా 14 మంది మృతి చెందారు. ఈ మృతులకు నేడు పార్లమెంటు భవనంలో ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి సి.పి రాధాకృష్ణన్‌, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజుతో పాటు పలవురు సీనియర్‌ పార్లమెంటు సభ్యులు కూడా నివాళులర్పించారు.

కాగా, 2001లో డిసెంబర్‌ 13న లష్కరే తోయిబా (ఎల్‌ఇటి), జైషే మహ్మద్‌ (జెఎం) ఉగ్రవాద సంస్థలకు చెందిన ఐదుగురు భారీ ఆయుధాలతో పార్లమెంట్‌ క్లాంప్లెక్స్‌లో చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -