– రాష్ట్ర విద్యారంగ అభివృద్ధికి, భవిష్యత్ పోరాటాలకు వేదిక కానున్న ఖమ్మం
– హాజరుకానున్న 600మంది ప్రతినిధులు : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు
నవతెలంగాణ-ఖమ్మం
భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర 5వ మహాసభలు ఈనెల 25వ తేదీ నుంచి 27 వరకు ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరగనున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు తెలిపారు. బుధవారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మంలో 2002 తర్వాత రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న రాష్ట్ర మహాసభల్లో 33 జిల్లాల నుంచి, 10 రాష్ట్ర యూనివర్సిటీలు, 6 సెంట్రల్ యూనివర్సిటీల నుంచి 600 మంది విద్యార్ధి ప్రతినిధులు మూడు రోజుల పాటు పాల్గొంటారని తెలిపారు. మొదటిరోజు 25న ఉదయం 11:00 గంటలకు జడ్పీ సెంటర్ నుంచి వేలాది మందితో ప్రదర్శన ప్రారంభం అవుతుందని, అనంతరం భక్తరామదాసు కళాక్షేత్రంలో బహిరంగ సభ జరుగుతుందన్నారు. దీనికి అధికసంఖ్యలో విద్యార్థులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను, సినీ నటులు మాదాల రవి, ఆహ్వాన సంఘం చైర్మెన్ మువ్వా శ్రీనివాసరావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్.మూర్తి తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి ఖమ్మం జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలకు ప్రాతినిధ్యం ఇస్తోందన్నారు. ఈ మహాసభలను ఖమ్మం జిల్లా విద్యార్థిలోకం, మేధావులు, విద్యావంతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు దొంతబోయిన వెంకటేష్, నాయకులు వినోద్, లోకేష్, త్రినాథ్, సుశాంత్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
25 నుంచి 27 వరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఐదవ మహాసభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES