Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఅమెరికాకు 25 దేశాల పోస్టల్‌ సర్వీసులు నిలిపివేత

అమెరికాకు 25 దేశాల పోస్టల్‌ సర్వీసులు నిలిపివేత

- Advertisement -

న్యూయార్క్‌: ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికాపై ఆయా దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో చిన్న ప్యాకేజీలపై పన్ను మినహాయింపులను ట్రంప్‌ యంత్రాంగం ఉపసంహరించుకున్న నేపథ్యంలో అమెరికాకు పోస్టల్‌ సర్వీసులు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇలా ఇప్పటివరకు భారత్‌ సహా 25 దేశాలు పోస్టల్‌ సర్వీసులను నిలిపివేసినట్టు ఐరాసలోని యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌ వెల్లడించింది. ఐరాస సభ్య దేశాలకు సంబంధించి పోస్టల్‌ సేవల మధ్య సహకారం కోసం ఏర్పాటైన యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌ స్విట్జర్లాండ్‌ కేంద్రంగా పనిచేస్తుంది. పోస్టల్‌ ప్యాకేజీలపై అమెరికా పన్ను మినహాయింపు ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు 25 దేశాలు అమెరికాకు పోస్టల్‌ సర్వీసులు నిలిపివేసినట్లు ఐరాస విభాగం తెలిపింది. ఇందుకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తూ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఆగస్టు 25న లేఖ రాసినట్టు వెల్లడించింది. అయితే, ఏయే దేశాలు ఈ జాబితాలో ఉన్నాయనే విషయాన్ని పేర్కొనలేదు. భారత్‌ సహా ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, నార్వే, స్విట్జర్లాండ్‌ తదితర దేశాలు ఈ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
అమెరికా యంత్రాంగం ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. 800 డాలర్ల విలువైన వస్తువులపై ఉన్న పన్ను మినహాయింపులను ఉపసంహరించుకుంది. ఫలితంగా అమెరికాకు వెళ్లే అన్ని పోస్టల్‌ సర్వీసులకు వాటి విలువతో సంబంధం లేకుండా సుంకాలకు లోబడి ఉంటాయి. 100 డాలర్ల విలువైన గిఫ్ట్‌ ఐటమ్స్‌, లేఖలు, దస్త్రాలకు మాత్రం సుంకాల నుంచి మినహాయింపు కొనసాగనుంది. ఆగస్టు 29 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad