– పన్నుల భారం వేసిన ట్రంప్
శ్వేతసౌధం: జపాన్, దక్షిణ కొరియాపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సోమవారం ఆ దేశాలకు సుంకాలు విధిస్తూ రాసిన లేఖలో ‘తీసుకోండి లేదా వదిలేయండి’ అని అల్టిమేటం ఇచ్చారు. సోషల్ మీడియాలో జపాన్ ప్రధాన మంత్రి ఇషిబా షిగెరు, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్‌లకు ట్రంప్ పంపిన లేఖల స్క్రీన్‌షాట్‌లు షేర్ అయ్యాయి. వాటిలో కొత్త సుంకాల రేట్లను అమలు చేయాలనే తన చర్య గురించి ట్రంప్ వారికి తెలియజేశారు. ”సుంకాల లేఖను మీకు పంపడం నాకు చాలా గౌరవప్రదమైన విషయం. ఇది మన వాణిజ్య సంబంధాల బలం, నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. వాణిజ్య లోటు ఉన్నప్పటికీ మీ దేశంతో కలిసి పనిచేయడానికి అమెరికా అంగీకరిస్తుంది” అని ఆ లేఖల్లో ట్రంప్ పేర్కొన్నారు.
జపాన్, దక్షిణ కొరియాపై 25 శాతం టారిఫ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES