నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరలపై సైన్యం మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. పాక్ గగనతలం నుంచి ముప్పు పొంచి ఉందని దేశంలోని 27 విమానాశ్రయాలను మూసివేసింది. మొత్తంగా 430 విమానాలను రద్దు చేసింది. ఈ నెల 10 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ సైన్యం సరిహద్దుల్లోని గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. ఈ క్రమంలో ప్రయాణికుల విమానాలను, విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగే ముప్పు ఉందని కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది.
27 విమానాశ్రయాలు క్లోజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES