Friday, May 30, 2025
E-PAPER
Homeజాతీయంఖరీఫ్‌ పంటలకు మద్దతు ధర పెంపు

ఖరీఫ్‌ పంటలకు మద్దతు ధర పెంపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కేంద్ర మంత్రివ‌ర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్‌ సీజన్‌లో వరి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపునకు ఆమోద ముద్ర వేసింది. వరి సాధారణ, గ్రేడ్- ఏకి రూ.69 పెంచగా.. జొన్నలు రూ. 328; సజ్జలు రూ.150; రాగులు రూ.596; మొక్కజొన్న రూ.175; కందిపప్పు రూ.450; పెసర రూ.86; మినుములు రూ.400; వేరుశెనగ రూ.480; పొద్దుతిరుగుడు రూ.441; సోయాబీన్ రూ.436; కుసుమలు రూ.579; ఒలిసెలు రూ.820; పత్తి రూ.589 చొప్పున కనీస మద్దతు ధరను పెంచారు. 2025-26 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి క్వింటాల్‌ వరిపై రూ.69 పెంచడంతో కనీస మద్దతు ధర రూ.2369కి చేరింది. కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. పలు పంటలకు ఎంఎస్‌పీ కోసం రూ.2.7లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లు కేటాయించగా.. రైతులకు పెట్టుబడిపై 50శాతం మార్జిన్‌ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -