Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ 

పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి  : భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం పోలీసులు 2కే రన్ ను నిర్వహించారు. వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్, జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ ఆదేశాల మేరకు పాలకుర్తి ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ కార్యక్రమానికి పోలీసులు ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై పవన్ కుమార్ మాట్లాడుతూ జాతీయ సమైక్యతకు సర్దార్ వల్లభాయి పటేల్ కృషి చేశారని తెలిపారు. 2కే రన్ శారీర దారుణ్యానికి, ఐక్యమత్యానికి దోహదపడుతుందని, ప్రతిరోజు రన్నింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఓరుగంటి రమేష్, పోలీస్ సిబ్బంది రాజ్ కుమార్, రవి, ప్రశాంత్ రెడ్డి, మనోజ్ కుమార్,మనోహర్, రోహిత్ విద్యార్థిని, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -