– రూ. 2.50 లక్షల నష్టం..
నవతెలంగాణ-వెల్దండ : వెల్దండ మండల పరిధిలోని తిమ్మినోని పల్లి గ్రామానికి చెందిన గుమ్మకొండ లింగమయ్య అనే రైతుకు చెందిన 3 పాడి ఆవులు పిడుగు పాటుకు గురై మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన వర్షానికి పిడుగు పడడంతో లింగమయ్య పశువుల షేడు సమీపంలో ఉన్న 3 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. రైతు లింగమయ్య మంగళవారం ఉదయం పాలు పిండెందు కు వ్యవసాయ పొలానికి వెళ్లి చూడగా ఆవులు రాత్రి వర్షంలో పిడుగు పడి మృతి చెందినట్లు గుర్తించారు. మూడు ఆవులు మృతి చెందడంతో రైతు కుటుంబం రోదనలు మిన్నంటాయి. ఒక్కో ఆవు విలువ రూ.80 వేలు ఉంటుందని మొత్తం మూడు ఆవుల విలువ రూ. 2.50 లక్షలు ఉంటుందని ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందించే ఆదుకోవాలని రైతు లింగమయ్య కోరారు.
పిడుగు పడి 3 పాడి ఆవులు మృతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

