నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 30 నుండి ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. ఈ సమావేశాలు మొత్తం 3 రోజులపాటు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. సమావేశాల నిర్వహణ కోసం అసెంబ్లీ సిబ్బందికి ఇప్పటికే సంబంధిత ఆదేశాలు జారీ చేయబడినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగనుంది. తెలంగాణ క్యాబినెట్ ఇటీవలే ఈ రిపోర్టును ఆమోదించింది. పూర్తి స్థాయిలో రూపొందించబడిన రిపోర్టు మొత్తం 600 పేజీలకు పైగా ఉంది. అసెంబ్లీ సభ్యులకు ఈ రిపోర్టును అందజేసి, అన్ని పార్టీల అభిప్రాయాలను సవివరంగా తెలుసుకొని, తర్వాత పూర్తి స్థాయిలో చర్చలు నిర్వహించడం లక్ష్యంగా ఉంది. చర్చల అనంతరం, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు సంబంధించి తుది నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా ప్రభుత్వానికి ముందుకు ఎలా అడుగులు వేయాలో నిర్ణయించుకోవడం జరుగనుంది.
ఈ నెల 30నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES