Thursday, May 15, 2025
Homeరాష్ట్రీయం21 రోజుల్లో 31 మంది మావోయిస్టులు హతం

21 రోజుల్లో 31 మంది మావోయిస్టులు హతం

- Advertisement -

– 18 మంది జవాన్లకు గాయాలు
– 450 మందు పాతరలతో సహా ఆయుధాలు స్వాధీనం
– మృతి చెందిన వారిపై రూ.1.72 కోట్ల రివార్డులు
– కర్రెగుట్టల ఆపరేషన్‌పై ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్‌
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

ఛత్తీసగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టుల నియంత్రణకు నిర్వహించిన ఆపరేషన్‌ కగార్‌ విజయవంతమైందని ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు. కర్రె గుట్టలపై భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌ వివరాలను బీజాపూర్‌ జిల్లా ఎస్పీ ఆఫీసులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు సీఆర్‌పీఎఫ్‌ డీజీ జీపీ సింగ్‌, ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ అరుణ్‌ దేవ్‌ గౌతం, బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌తో పాటు సుకుమా, దంతేవాడ, బీజాపూర్‌ జిల్లాల ఎస్పీలు మాట్లాడారు. 21 రోజుల్లో 28 సార్లు ఎన్‌కౌంటర్‌ జరగగా 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలిపారు. వీరిలో 16 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారన్నారు. ఈ ఆపరేషన్‌లో మృతిచెందిన మావోయిస్టులపై రూ.1. 72 కోట్ల రివార్డు ఉన్నట్టు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో 18 మంది జవాన్లు గాయపడ్డారని తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల్లో 20 మందిని గుర్తించామని ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. 31 మంది మావోయిస్టుల వద్ద నుంచి 35 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఎస్‌ఎల్‌ఆర్‌.. ఇన్సాస్‌, కంట్రీ మేడ్‌ రైఫిల్‌, బీజీఎల్‌ లాంచర్స్‌, షార్ట్‌ గన్‌, 1000 మీటర్ల వైరు, 450కి పైగా మందుపాతరలు, వైర్లెస్‌ సెట్లు, ప్రింటర్లు, భారీ మొత్తంలో మావోయిస్టులకు చెందిన ఆహార పదార్థాలు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఉన్నట్టు తెలిపారు. వీటిలో 15 మందు పాతరలను నిర్వీర్యం చేసినట్టు చెప్పారు. ఈ ఆపరేషన్‌లో సీఆర్పీఎఫ్‌, కోబ్రా, డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌కు చెందిన జవాన్లు భారీ ఎత్తున పాల్గొనట్ల్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -