Monday, May 12, 2025
Homeజాతీయం32 విమానాశ్రయాలు రీఓపెన్

32 విమానాశ్రయాలు రీఓపెన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో 32 విమానాశ్రయాలను మూసేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణను ప్రకటించడంతో ఈ ఎయిర్‌పోర్టులను సోమవారం ఉదయం నుంచి తిరిగి ప్రారంభించినట్టు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) విమానాశ్రయ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన మే 7న అంబాలా, అమృత్సర్, భుజ్, బికనీర్, చండీగఢ్, హిండన్, జైసల్మేర్, జమ్మూ, జామ్‌నగర్, జోధ్‌పూర్, లేహ్, లూధియానా, ముంద్రా, పోర్బందర్, రాజ్‌కోట్, సిమ్లా, శ్రీనగర్ వంటి ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలు మూతబడ్డాయి. దీనివల్ల విమానయాన సంస్థలు వందలాది విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -