– ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా పదవీ విరమణ అవినీతిని సహించని ఉన్నతాధికారిగా హర్యానాలో మంచి పేరు
– బీజేపీ, కాంగ్రెస్ పాలనలో ఆయనపై తరచూ బదిలీ వేటు
చండీగఢ్ : అవినీతికి వ్యతిరేకంగా నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరున్న ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కా పదవీ విరమణ చేశారు. ఈయన హర్యానా క్యాడర్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఈయన కెరీర్ మొత్తం బదిలీలతోనే నిండిపోయింది. తన 33 ఏండ్ల సర్వీసులో 57 సార్లు వేర్వేరు పోస్టులకు ట్రాన్స్‌ఫర్ అయ్యా రు. దీంతో తన మూడు దశాబ్దాల సర్వీసులో భారత్‌లో అత్యధికంగా బదిలీలు గావించబడిన సివిల్ సర్వెంట్లలో ఒకరిగా అశోక్ ఖేమ్కా నిలిచారు. ఈయన సర్వీసులో సగటున ప్రతి ఏడు నెలలకు ఒకసారి బదిలీ అయ్యారన్న మాట. అశోక్ ఖేమ్కా అవినీతిని సహించని కారణంగా.. ఆయన తాను పని చేసిన విభాగాలలో అవకతవకలను బహిర్గతం చేసి, చర్యలు తీసుకునేవారు. దాని ఫలితంగా రాజకీయ, అధికార సంస్థల నుంచి వచ్చే ఒత్తిళ్ల కారణంగా తరచూ పలు పోస్టింగ్‌లకు బదిలీ అయ్యేవారు.
కాంగ్రెస్ పాలనలో 21 సార్లు బదిలీ
2004 నుంచి 2014 మధ్య హర్యానాలోని భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అశోక్ ఖేమ్కా 21 సార్లు బదిలీ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలో మనోహర్‌లాల్ ఖట్టర్ నాయకత్వంలోని బీజేపీ పాలనలోనూ ఇదే పరంపర కొనసాగింది. ఐదేండ్ల పాలనలో ఏడు సార్లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అవినీతిపై అశోక్ ఖేమ్కా కఠినవైఖరి కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనను తక్కువ ప్రొఫైల్‌గా భావించే విభాగాలకు పంపేవి. దీనిపై అశోక్ ఖేమ్కా ఆందోళన వ్యక్తం చేసేవారు. పురావస్తు, మ్యూజియంల విభాగానికి 53వ సారి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఎక్స్ (అప్పుడు ట్విట్టర్) వేదికగా 2019లో ఆయన తన అసంతృ ప్తిని, బాధను వెలిబుచ్చారు. ”నిజాయితీకి ప్రతిఫలం అవ మానం” అని రాసుకొచ్చారు. అశోక్ ఖేమ్కాను ప్రభుత్వాలు తరచుగా ఆర్కైవ్స్, పురావస్తు, ప్రింటింగ్, స్టేషనరీ వంటి తక్కువ స్థాయిగా భావించే విభాగాలకు బదిలీలు చేసేవి. 2022 అక్టోబర్‌లో హర్యానా ప్రభుత్వం ఇతరులను కార్యద ర్శి స్థాయికి పదోన్నతిని కల్పిస్తూ.. అశోక్ ఖేమ్కాను మాత్రం విస్మరించింది. ఆ సమయంలో దీనిపై ఆయన ఎక్స్ వేదిక గా తన ఆవేదనను, నిరాశను వెలిబుచ్చారు. అశోక్ ఖేమ్కా 57వ బదిలీ గతేడాది డిసెంబర్‌లో జరిగింది. ఆ సమయం లో ఆయన రవాణా శాఖ అదనపు కార్యదర్శిగా నియమితు లయ్యారు. తన పదవీవిరమణకు కేవలం నాలుగు నెలల సమయం ముందు ఆయనకు ఈ పోస్టింగ్ వచ్చింది.
ఆ ఒప్పందం రద్దుతో జాతీయస్థాయిలో ఆయనపేరు
2012లో హర్యానా భూసమీకరణ, హౌల్డింగ్స్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా అశోక్ ఖేమ్కా వ్యవహరించారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన స్కైలైట్ హాస్పిటాలిటికీ, గురుగ్రామ్‌లోని మనేసర్-షికోపూర్‌లోని రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కి మధ్య జరిగిన 3.5 ఎకరాల భూ ఒప్పందాన్ని రద్దు చేయటంతో ఖేమ్కా పేరు జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున వినబడింది. ఆ తర్వాత ఖేమ్కా బదిలీ అయ్యారు.
ఎవరు ఈ అశోక్ ఖేమ్కా?
అశోక్‌ఖేమ్కా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఏప్రిల్ 30, 1965న ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి శంకర్‌లాల్ ఖేమ్కా ఒక జ్యూట్ మిల్లులో అకౌంటెంట్‌గా పని చేశారు. 1988లో ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో అశోక్‌ఖేమ్కా బీ.టెక్ చేశారు. ఆ తర్వాత ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎ ఫ్‌ఆర్) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశా రు. ఆ తర్వాత ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివ ర్సిటీ (ఇగ్నో) నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనా న్స్‌లో ప్రత్యేకత కలిగిన ఎంబీఏ డిగ్రీని, ఆర్థిక శాస్త్రంలో ఎంఏ డిగ్రీని, అలాగే పంజాబ్ యూనివర్సిటీ నుంచి బ్యా చ్‌లర్ ఆఫ్ లా డిగ్రీ (2016-19 మధ్య)ని పొందారు.
33 ఏండ్లు.. 57 సార్లు బదిలీలు
- Advertisement -