నవతెలంగాణ-గోవిందరావుపేట
దివంగత నేత భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 34 వర్ధంతి సభను మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి వెంకటకృష్ణ నివాళులు అర్పించి అనంతరం ప్రజలతో మాట్లాడారు.సాంకేతిక రంగాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని, ఆధునిక భావాలు, నిర్ణయాత్మక శక్తి కలిగిన రాజీవ్‌గాంధీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాని అని ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తన ప్రధాన ఆశయాలలో భారత ఐక్యతను పరిరక్షిస్తూనే దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్ళడం ముఖ్యమైనదని రాజీవ్ పదేపదే చెబుతూండేవారని అన్నారు. భారత దేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశాడని రాజీవ్ గాంధీ ని కొనియాడారు. 1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదుర్ ఎన్నికల ప్రచారంలో ఎల్.టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన దాడిలో రాజీవ్ గాంధీ మరణించాడు. యావత్ దేశం అభిమానించే రాజీవ్ గాంధీ చనిపోయిన నాటినుండి మే 21 తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించబడింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖా జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34 వ వర్ధంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES