నవతెలంగాణ-హైదరాబాద్: భోజ్‌పూరి గాయకురాలు నేహా సింగ్ రాథోడ్‌పై లక్నో పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రధాన కారణం పాలక ప్రభుత్వపు నిఘా వైఫల్యం, భద్రతా లోపమని నేహా సింగ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. దీంతో మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారంటూ ఆమెపై బిఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద లక్నోలోని హజరత్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. దేశద్రోహంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, మతవిద్వేషాలను ప్రోత్సహించినట్లు ఆరోపించారు. ఆమె తన ట్విటర్ ద్వారా జాతీయ సమగ్రతను ప్రతికూలంగా ప్రభావితం చేసే కొన్ని అభ్యంతరకరమైన పోస్టులు చేశారంటూ, మతం ఆధారంగా ఒక కమ్యూనిటీని మరో కమ్యూనిటీపై రెచ్చగొట్టేలా ప్రయత్నాలు చేశారంటూ అభరు ప్రతాప్ సింగ్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా బిఎన్‌ఎస్‌లోని కొత్త క్రిమినల్ కోడ్ సెక్షన్ 152 కింద దేశ సార్వభౌమత్వం, ఐక్యత మరియు సమగ్రతకు ముప్పు కలిగిస్తున్నారని ఆరోపించారు.
భోజ్‌పురి గాయకురాలిపై దేశద్రోహం కేసు
- Advertisement -
RELATED ARTICLES