– పాలస్తీనా యాక్షన్ నిరసనలో పాల్గొనటంతో..
లండన్ : కార్యకర్తల సమూహంపై నిషేధం వాక్ స్వాతంత్య్రాన్ని , సమావేశ స్వేచ్ఛను బ్రిటిష్ ప్రభుత్వం అణచివేస్తుందన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాలస్తీనా అనుకూల ప్రదర్శనలను అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శకులు అంటున్నారు.గత నెలలో బ్రిటిష్ ప్రభుత్వం ”ఉగ్రవాద సంస్థ”గా వర్గీకరించిన పాలస్తీనా యాక్షన్ సమూహానికి మద్దతుగా జరిగిన నిరసనలో లండన్‌లోని పోలీసులు వందలాది మందిని అరెస్టు చేశారు.”నిషేధిత సంస్థకు మద్దతు ఇచ్చినందుకు” శనివారం స్థానిక సమయం సాయంత్రం 6 గంటలకు పార్లమెంట్ స్క్వేర్ వద్ద 365 మంది ప్రదర్శనకారులను అరెస్టు చేసినట్టు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలలో.. ”నేను జాతి నిర్మూలనను వ్యతిరేకిస్తున్నాను. నేను పాలస్తీనా చర్యకు మద్దతు ఇస్తున్నాను” అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు.అక్కడే బైటాయించిన నిరసనకారులను పోలీసులు బలవంతంగా తొలగించారు.”గాజాలో జరిగిన మారణహౌమాన్ని , పాలస్తీనా యాక్షన్ నిషేధాన్ని ప్రజలు సమిష్టిగా వ్యతిరేకిస్తున్నారు,” అని నిరసనను నిర్వహించిన న్యాయవాద సంస్థ డిఫెండ్ అవర్ జ్యూరీస్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
లండన్‌లో 365 మంది అరెస్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES