Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్40 ఏండ్ల కళ నేటితో తీరింది: ఎమ్మెల్యే

40 ఏండ్ల కళ నేటితో తీరింది: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ప్రతి ఒక్క పేదవాడికి సొంతింటి కల కలగానే మిగులుతుంది అనుకున్నా. కానీ నేటితో అంకాపూర్ లో ఇండ్ల పంపిణీతో నా జీవితానికి అర్థం తెలిసింది అని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. మండలంలోని అంకాపూర్ గ్రామంలో శుక్రవారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ ప్రజల కోసం ఎక్కడి వరకు అయినా వెళుతాను అవసరం అయితే కాళ్ళు మొక్కడానికి కూడా సిద్ధం అని అన్నారు. మెజార్టీ కుటుంబాలకు ఇండ్లు ఇప్పించిన అని కొన్ని కుటుంబాలకు అతి త్వరలో ఇప్పిస్త అని, అంకాపూర్ లో ఇల్లు లేని పేదవారు ఉండకూడదు అని అందుకే కాంట్రాక్టర్ తో మాట్లాడి సొంత డబ్బులతో పని చేయించిన అని అన్నారు. నాకు ఇంత ప్రేమ ఉంది కాబట్టి ఎం అన్న భరిస్తా..మీ బిడ్డను నేను అని అన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను అని, అంకాపూర్ లో రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధికి తోడ్పాటు అందించాలి ఏ పార్టీ పిలిచిన అభివృద్ధి కోసం వస్తానని అన్నారు. నాకు జన్మనిచ్చిన ఈ గ్రామం కోసం ఏం చేసిన తక్కువ అని మాజీ సర్పంచ్ స్వర్గీయ రాజారెడ్డి చేసిన అభివృద్ధి బాటలో ఇప్పటికీ  ఆచరిస్తున్న నా గ్రామస్తులు గొప్పవారన్నారు. నందిపేట్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మాణాల కోసం, పట్టణంలో మున్సిపల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు అడుగుతున్న జిల్లా కలెక్టర్ తో ప్రభుత్వంతో నిధులు ఇప్పించే బాధ్యత తనదని అన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సహకారంతో ప్రభుత్వం ద్వారా నిధులు ఇప్పిస్తా అని అన్నారు. అధికారుల మీద ఒత్తిడి ఉండటం సహజం అని ప్రతి ఒక్కరు నాకు సహకారాన్ని అందించాలని కోరుతున్న  ఎమ్మెల్యే గా కాకుండా మీ బిడ్డ గా అడుగుతున్న అని కుల మతాల, పార్టీలకు అతీతంగా అభివృద్ధి  చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, తాహిర్ బిన్, మర చంద్ర మోహన్ రెడ్డి, ఏబీ చిన్న, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -