Saturday, May 17, 2025
Homeజిల్లాలు400 గ్రాముల గంజాయి పట్టివేత 

400 గ్రాముల గంజాయి పట్టివేత 

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్ 

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పరిధిలో 400 గ్రాముల గంజాయి పట్టుకున్నట్లు జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ విలాస్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని సుభాష్ నగర్ లో గల ఎక్సైజ్ స్టార్స్ ఫోర్స్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ ప్రొహిబిషన్ అధికారి ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ విలాస్, ఎస్ఐ సింధు ఆధ్వర్యంలో పక్కా సమాచారం మేరకు నవీపేట్ రైల్వే పోలీస్ స్టేషన్ వద్ద శివాజీ చౌక్ దర్యా పూర్ లో పక్కా సమాచారం మేరకు దాడులు చేయగా శివాజీ చౌక్ వద్ద దర్యాపూర్ గ్రామానికి చెందిన పురుషోత్తం, ఖురేషి చోటు మియా అనే ఇద్దరు వ్యక్తుల వద్ద క్యారీ బ్యాగుల్లో ఒక్కొక్కరి వద్ద 200 గ్రాముల చొప్పున మొత్తం 400 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది. అక్రమంగా కలిగి ఉండి, విక్రయిస్తున్న కారణంగా అట్టి 400 గ్రాముల గంజాయినీ సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం అట్టి నేరస్తుల్ని అరెస్ట్ చేసి ఎస్.హెచ్.ఓ నిజామాబాద్ కు అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడులలో సిబ్బంది చంద్ర మోహన్, నీలీరాజు, కిరణ్ కుమార్, నర్సయ్య చారీ, సాగర్రావు, సలీం, భూమేశ్వర్, గోపి, కార్తీక్, దశ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -