– బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు
నవతెలంగాణ – కామారెడ్డి బీసీలకు 42 శాతం విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్ బిల్లులను రాజ్యాంగ 9వ షెడ్యూల్ లో చేర్పు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించడం జరిగిందని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకుల పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో ఈ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
42 శాతం రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేయాలనీ, అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ నిధులను బిసి విద్యా, ఉపాధి ఆర్థిక అభివృద్ధి కోసం తక్షణమే 40,000 కోట్లు కేటాయించి ఖర్చు చేయాలనీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ , ఎస్టీ, జేఏసీ రాష్ట్ర నాయకులు లక్ష్మణ్,కామరెడ్డి జిల్లా నాయకులు అరవింద్,రాజు, పర్శరములు, గంగరాజు,నితిన్, లక్ష్మణ్, రాజశేఖర్, శివరామకృష్ణ , తదితరులు పాల్గొన్నారు.



