నవతెలంగాణ నాంపల్లి: వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన48 మంది ప్రముఖులను ప్రతి యేటా తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలతో సత్కరి స్తోంది. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య వెల్దండ నిత్యానందరావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఆయా రంగాల ప్రముఖులను పురస్కారాలకు ఎంపిక చేసింది. వీరికి తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణంలో త్వరలో పురస్కారాలు అందజేయనున్నట్టు రిజిస్టార్ ఆచార్య కోట్ల హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కారంతోపాటు ఒక్కొక్కరికి రూ.5,116 చొప్పున నగదు అందజేసి సత్కరి స్తామని పేర్కొన్నారు.
పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులు…
తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలకు ఎంపికైన వారిలో మునిమడుగుల రాజారావు (ఆధ్యాత్మిక సాహిత్యం), వారణాసి వెంకటేశ్వర్లు (ప్రాచీన సాహిత్యం), కె. హరనాథ్(సృజనాత్మక సాహి త్యం), సి.ఎస్.రాంబాబు (కాల్పనిక సాహిత్యం ), ప్రభాకర్ మందార (అనువాద సాహిత్యం), ఎస్.రఘువర్మ (అనువాదం), గంగిశెట్టి శివకు మార్ (బాలసాహిత్యం), డాక్టర్ వెలువోలు నాగ రాజ్యలక్ష్మి (ఉత్తమ రచయిత్రి), మంగారి హిమ జ(ఉత్తమ రచయిత్రి), విల్సన్ రావు కొమ్మవరపు (వచన కవిత), సయ్యద్ హనీఫ్ (వచన కవిత), ముంజంపల్లి వీరబ్రహ్మేంద్రాచారి(పద్యరచన), చింతోజు మల్లికార్జునాచారి (పద్యరచన), పిన్నం శెట్టి కిషన్(కథ), ప్రభాకర్ జైని (నవల), మంగిపూడి రాధిక (హాస్య రచన), జ్యోతిరాణి (వివిధ ప్రక్రియలు), డాక్టర్ దేశిరాజు లక్ష్మీ నరసింహా రావు (ఉత్తమ నాటక రచయిత), పి.వెంకటేశ్వ రరావు(ఉత్తమ నటుడు), మంగాదేవి (ఉత్తమ నటి), డాక్టర్ రాయల హరిశ్చంద్ర (నాటక రం గం), డాక్టర్ చిత్తర్వు మధు(జనరంజక విజ్ఞానం ), డాక్టర్ వి.త్రివేణి (పరిశోధన), ఆచార్య డి.విజ యలక్ష్మి (భాషాఛందస్సు), ఆచార్య సీహెచ్ సుశీలమ్మ (సాహిత్య విమర్శ), బులుసు అపర్ణ (అవధానం), అయ్యగారి సీతారత్నం(మహిళాభ్యుదయం), హెచ్.హేమవతి(లలిత సంగీతం), రామలక్ష్మి రంగాచార్య (శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు), మంగ్లీ (జానపద గాయకులు), పద్మాలయ ఆచార్య (జానపద కళలు), పగిడిపాల ఆంజనేయులు (జీవిత చరిత్ర), పొత్తూరి సుబ్బారావు(పత్రికా రచన), రతన్ కుమార్ (పేరిణి నృత్యం), ఎ. వెంకట రామమోహన చలపతి శాస్త్రి( కూచిపూడి నృత్యం), పాలకుర్తి రామమూర్తి(వ్య క్తిత్వ వికాసం), చెగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి (హేతు వాద ప్రచారం), ఆచార్య సి.మురళీకృష్ణ (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), సుధాకర్ గౌడ్ (గ్రంథాలయ కర్త), వి.ఎస్.రాజ్యలక్ష్మి(సాంస్కృ తిక సంస్థ నిర్వహణ), డాక్టర్ ఎస్.మనోహర్ రావు(ఇంద్రజాలం), సుభాని షేక్ (కార్టూనిస్ట్), పండితారాధ్యుల వీరేశలింగం(జ్యోతిషం), పాతూరి మహేందర్రెడ్డి(ఉత్తమ ఉపాధ్యాయులు), కంది నరసింహులు (చిత్రలేఖనం), నందకిషోర్ (వచన కవిత-45 సంవత్సరాల లోపువారికి), పిల్లుట్ల ముకుందం (జానపద కళలు), ఇరువింటి వెంకటేశ్వర శర్మ(గజల్) ఉన్నారు.