– మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు
– అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ ఆరోపణ
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని కోటిలింగేశ్వర నగర్ కల్కి4వ వీధి అధ్వాన్నంగా మారిందని ఆ కాలనీ నూతన అధ్యక్షులు డాక్టర్ బి విఠల్ ముదిరాజ్ ఆరోపించారు. ఆదివారం సాయంత్రం కాలనీ సర్వసభ్యుల సమావేశంలో అధ్యక్షులుగా డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటిలింగేశ్వర నగర్ కాలనీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాలనీ లో రోడ్లు లేవు, వీధి లైట్లు లేవు, మురికికాల్వలు లేవు, మట్టిరోడ్లు అన్ని ముళ్ళపొదలతో నిండిన కాలనీ అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ ఇంటి ట్యాక్స్ రూపంలో వేల రూపాయలు వసూలు చేయడమే తప్పా.. కామారెడ్డి మున్సిపాలిటీ అధికారులు పనులు చేయడం లేదని ఆరోపించారు. కాలనీలో పిచ్చి మొక్కలతో నిండిపోయింది, దీంతో పాములు, విష పురుగులు, తేళ్ళు, కప్పలు, కుక్కలు, లక్షల్లో దోమలు, ఈగలు, కాలనీవాసులు, తీవ్ర,అనారోగ్యాలకు, ఇబ్బందులకు గురి అవుతున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే , వెంకటరమణ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. కోటిలింగేశ్వర నగర్ కాలనీవాసులు కోరారు. కాలనీ సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెపుతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పిల్లలు, మహిళలతో కలిసి ప్రత్యక్ష చర్యలకు దిగుతామని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది అన్నారు. తమ కాలనీ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సమ్మిరెడ్డి, సతీష్ కుమార్ నర్సింలు ,చంద్రం ముదిరాజ్,రమేష్ గౌడ్ ,వెంకటేష్ ముదిరాజ్ ,రాజులు సార్,సురేందర్ రెడ్డి కషగౌడ్,సంజీవరెడ్డి, రాజేందర్,భూమన్న, వడ్ల చంద్రం,రాజయ్య ముదిరాజ్,తదితరులు పాల్గొన్నారు.
కోటిలింగేశ్వర నగర్ కల్కి4వ వీధి ఎన్నికలు
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని కోటిలింగేశ్వర నగర్ 4వ వీధి సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్, ఉపాద్యక్షులుగా సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి.సామిరెడ్డి, కోశాధికారిగా, నారాయణరావు, సహాయ కార్యదర్శి గా నర్సింలు, సభ్యులుగా చంద్రం ముదిరాజ్, సురేందర్ రెడ్డి, కషగౌడ్,సంజీవరెడ్డి, ఆంజనేయులు.కోఆర్డినేటర్,గా రాజేందర్ సెట్, రాజులు సార్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.