నవతెలంగాణ-హైదరాబాద్ : నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ నాలుగేళ్ల బాలుడిని వీధికుక్కలు చుట్టుముట్టి కరవడంతో స్పాట్ లోనే చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేతంచెర్ల పట్టణంలోని హనుమాన్‌నగర్ కాలనీలో నివసం ఉంటున్న హుస్సేన్ బాషా, ఆశ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు మొహిద్దీన్(4) 2025 మే 02వ తేదీ శుక్రవారం సాయంత్రం మరో బాలుడితో కలిసి ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు.
అయితే ఇదే టైమ్ లో ఓ కుక్కల గుంపు వీరి దగ్గరికి వచ్చాయి. వెంటనే ఇద్దరు చిన్నారులు పరుగెత్తినా మొహిద్దీన్ మాత్రం కుక్కల దాడికి గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మొహిద్దీన్ చనిపోయినట్లుగా వైద్యులు నిర్థారించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది.
దారుణం.. వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు బలి!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES