– ఏన్ పి ఆర్ డీ రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట్….
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా ఎన్ పి ఆర్ డి రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట్ హాజరై, మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లు,రాజీవ్ యువ వికాసం పథకాలలో వికలాంగులకు 5% శాతం రిజర్వేషన్లు అమలు చెయ్యాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 5శాతం కేటాయించి, వికలాంగుల కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ, ఆర్టీసీ , మండల పరిషత్ పరిధిలో ఉన్న షాపింగ్ కంప్లెక్స్లలో రిజర్వేషన్ అమలు చేయాలని, యాదగిరి గుట్ట దేవస్థానం పరిధిలో ఉన్న షాపింగ్ కంప్లెక్స్ లలో వికలాంగుకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఇచ్చి 150రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. 2016 ఆర్పిడబ్ల్యుడి , 2017 మెంటల్ హెల్త్ కేర్ చట్టలపై ప్రభుత్వ అధికారులకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు.కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో వికలాంగుల కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో 1000 గజాల స్థలంలో వికలాంగుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్ మాట్లాడుతూ ఈ జిల్లాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులో సామూహిక ప్రాంతాలు వికలాంగులకు అనుకూలంగా ఉండే విధంగా ర్యాంపు విత్ రెలింగ్ సౌకర్యాలు కల్పించాలని వీల్ చేరే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా యాదగిరిగుట్ట టెంపుల్ లో ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ భూమిని వికలాంగులు ఉపాధి పొందడం కొరకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి వన ఉపేందర్ మాట్లాడుతూ వికలాంగులను దేవుడితో ఆపాదించి వికలాంగులకు ఇవ్వాల్సిన సౌకర్యాలను మర్చిపోయారని విమర్శించడం జరిగింది. ప్రభుత్వాధికారులు పాలకులు స్పందించి వికలాంగుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని కోరారు.
సామాజిక ఉద్యమ నేత బట్టు రామచంద్రయ్య మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ఈ దేశ సంపద దేశంలోని పౌరులందరికీ పాంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అందులో వికలాంగులను విస్మరించడం సిగ్గుచేటని అన్నారు. రాజ్యాంగబద్ధంగా రావలసిన హక్కులను మాత్రమే సంఘం డిమాండ్ గా పెట్టిందని వెంటనే వీటి పరిష్కారానికి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. వికలాంగుల చైతన్య పరచడం కోసం సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి, ఉపాధ్యక్షురాలు బర్ల పార్వతి, భువనగిరి డివిజన్ ప్రధాన కార్యదర్శి యాదగిరి, ఎన్ పి ఆర్ డి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు మాదిరే పద్మ, జిల్లా నాయకులు బల్గురు అంజయ్య, శంకర్, రాయగిరి యాదగిరి, నాగు నరసింహ, పెద్ద శ్రీనివాస్ రెడ్డి, నరేష్, జోకు స్వామి, బోయపల్లి యాదగిరి, వి మంజుల, వెంకటేశం లు పాల్గొన్నారు.
వికలాంగులకు 5% శాతం రిజర్వేషన్లు అమలు చెయ్యాలి….
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES