- Advertisement -
నవతెలంగాణ చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో పెద్దఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నారాయణపూర్, సుక్మా, బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో కలిపి మొత్తం 51 మంది ఆయుధాలు వీడారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేయడం, ప్రభుత్వ పునరావాస విధానం అమలుతో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. 2024 నుంచి ఇప్పటివరకు బీజాపుర్ జిల్లాలో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్‌లలో 185 మంది మావోయిస్టులు మృతిచెందారని, 803 మంది అరెస్టు కాగా.. 431 మంది లొంగిపోయారన్నారు.
- Advertisement -