- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమాసియాలో సంక్షోభంతో భారత రిఫైనరీలు రష్యా నుంచి భారీగా క్రూడాయిల్ కొనుగోలు చేశాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఏకంగా 6 కోట్ల బ్యారెళ్ల చమురు ఎప్రిల్‌లో డెలివరీ కానుందని పేర్కొంది. బ్రెంట్ ధరకు అదనంగా 5-15 డాలర్ల ప్రీమియం రేటుకు కొనుగోలు చేశాయని తెలిపింది. కాగా రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో ఇతర దేశాలు సైతం భారీగా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
- Advertisement -



