Wednesday, December 31, 2025
E-PAPER
Homeబీజినెస్విరోహన్‌కు రూ.65 కోట్ల నిధులు

విరోహన్‌కు రూ.65 కోట్ల నిధులు

- Advertisement -

హైదరాబాద్‌ : హెల్త్‌కేర్‌ ఎడ్యుటెక్‌ స్టార్టప్‌ అయిన విరోహన్‌ ఇటీవల సిరీస్‌ బి ఫండింగ్‌ రౌండ్‌లో భాగంగా రూ.65 కోట్ల (దాదాపు 7.5 మిలియన్‌ డాలరు) పెట్టుబడిని సమీకరించినట్టు ప్రకటించింది. జపాన్‌కు చెందిన హెచ్‌ఆర్‌ సంస్థ మైనవి కార్పొరేషన్‌ ఈ రౌండ్‌కు నాయకత్వం వహించింది. బ్లూమ్‌ వెంచర్స్‌, భారత్‌ ఇంక్లూజివ్‌ టెక్నాలజీస్‌ సీడ్‌ ఫండ్‌, రీబ్రైట్‌ పార్టనర్స్‌ వంటి ప్రస్తుత పెట్టుబడిదారులు కూడా ఇందులో పాల్గొన్నారని ఆ సంస్థ పేర్కొంది. ఈ నిధులను ప్రొడక్ట్‌ ఇన్నోవేషన్‌, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం, సంస్థను లాభదాయకత దిశగా తీసుకెళ్లడానికి ఉపయోగించనున్నట్టు విరోహన్‌ సీఈఓ కుణాల్‌ దుడేజా పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -