నవతెలంగాణ – కామారెడ్డి
ఇప్పటివరకు మధ్య దుకాణాలకు జిల్లా వ్యాప్తంగా 71 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటేడెంట్ బి, హనుమంత రావు తెలిపారు. మద్యం షాప్ ల దారాఖాస్తుల ప్రక్రియ 2025 -2027 సంవత్సరానికి మద్యం దుకాణాలకు గాను కామారెడ్డి స్టేషన్ ఫరిది లో మొత్తం 15 వైన్ షాప్లకు గాను 18 దరఖాస్తులు వచ్చాయి. దోమకొండ స్టేషన్ పరిధిలో మొత్తం8 వైన్ షాప్లకు 10దరఖాస్తులు వచ్చాయి. ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో మొత్తం 07 వైన్ షాప్లకు 04 దరఖాస్తులు వచ్చాయి. బాన్సువాడ స్టేషన్ పరిధిలో మొత్తం 09వైన్ షాప్లకు గాను 16దరఖాస్తులు వచ్చాయి.
బీచుకుందా స్టేషన్ పరిధిలో మొత్తం 10వైన్ షాప్లకు గాను 23దరఖాస్తులు వచ్చాయి. గురువారం వరకు కామారెడ్డి జిల్లాలో 49 వైన్ షాప్ లకు 71 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ రెండవ శనివారం అనగా తేది 11-10-2025 నా యధావిధిగా దరఖాస్తులు తీసుకొన బడుతాయన్నారు. ఒకరు ఎన్ని అయినా అప్లికేషన్స్ వేసుకొనవచ్చును అలాగే ఎక్కడైనా వేసుకొనవచును. ప్రభుత్వ ఆదాయానికి గండి పడేలాగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తూ సిండికేట్ లు గా ఏర్పడితే కఠిన చర్యలు తీసుకొన బడుతాయి. ఇటువంటి వారి పై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ నిఘాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మద్యం దుకాణాలకు 71 దరఖాస్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES