- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి అక్రమంగా డ్రోన్లను తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను అధికారులు గుర్తించారు. మహమ్మద్, తాజ్, హస్గర్ అనే ముగ్గురు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా తమ సామగ్రిలో 74 డ్రోన్లను రహస్యంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.42 లక్షలు ఉంటుందని అంచనా.
- Advertisement -



