నవతెలంగాణ-హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఓ కూలీకి వజ్రాలు దొరికాయి. అతనికి తాను పనిచేసే నిసార్ గనిలో ఒకటికాదు రెండుకాదు ఏకంగా 8 వజ్రాలు దొరికాయి. వాటి ధర సుమారు రూ. 12లక్షలు ఉంటుందని అధికారుల అంచనా. పూర్తి వివరాల్లోకి వెళితే… ఛతర్‌పూర్ జిల్లాలోని కటియా గ్రామానికి చెందిన హర్‌గోవింద్, పవన్ దేవి దంపతులు గత ఐదేళ్లుగా పన్నాలోని నిసార్ గనిలో పనిచేస్తున్నారు.
వీరికి గనిలో ఒకేసారి 8 వజ్రాలు దొరికాయి. వాటి విలువను నిపుణులు నిర్ధారించాక, వేలంలో వచ్చిన మొత్తం నుంచి పన్నులు పోగా మిగతా డబ్బును గోవింద్ ఫ్యామిలీకి అందజేస్తారు. హర్‌గోవింద్ మాట్లాడుతూ… “భగవంతుడు ఈసారి మమ్మల్ని కనికరించాడు. గతంలోనూ ఓ వజ్రం దొరికింది. అప్పుడు తెలియక కేవలం రూ. లక్ష మాత్రమే నా చేతికి వచ్చింది” అని అన్నాడు.