Wednesday, June 18, 2025
E-PAPER
Homeసినిమాశక్తివంతమైన మహిళ పాత్రతో '8 వసంతాలు'

శక్తివంతమైన మహిళ పాత్రతో ‘8 వసంతాలు’

- Advertisement -

మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘8 వసంతాలు’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతోంది. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సునీల్‌కుమార్‌ లీడ్‌ రోల్‌ పోషించారు. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా సోల్‌ఫుల్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్‌ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రం ఈనెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి మంగళవారం మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
‘మను’ సినిమా తర్వాత ఆరేళ్లు గ్యాప్‌ వచ్చింది. ఈ సమయంలో కొన్ని కథలపై వర్క్‌ చేశాను. అయితే ‘8 వసంతాలు’ మెయిన్‌ ప్రయారిటీ. స్త్రీ కోణంలోకి వెళ్లి ఆ సున్నితత్వాన్ని పట్టుకోవడానికి, కథ రాయడం కంటే స్త్రీ దక్కోణాన్ని డెవలప్‌ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టింది. ఈ కథని కూడా ఒక బలమైన స్త్రీ పాత్ర చుట్టూ చెప్పాలని అనిపించింది.
నేను రాసుకున్న పాత్రకు అనంతిక పర్ఫెక్ట్‌ యాప్ట్‌. కేవలం నటిగానే కాదు, దాదాపు 13 కళలలో ఆమెకు ప్రవేశం ఉంది. తనకి మార్షల్‌ ఆర్ట్స్‌ వచ్చు. తను ఈ పాత్రను ఎలా చేస్తుందో అనే డౌట్‌ ఎప్పుడూ లేదు. తను చక్కగా తెలుగు మాట్లాడుతుంది. శుద్ధి అయోధ్య పాత్రకు పూర్తి న్యాయం చేసింది.
టీజర్‌, ట్రైలర్‌లో వాడిన భాష, కవిత్వం ఇప్పటి జెన్‌జీ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అవుతుందా అని అందరూ అడుగుతున్నారు. అయితే మేం ఇందులో గ్రాంధికం వాడలేదు. ‘ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం’ అని ఓ డైలాగ్‌ ఉంది. ఇందులో గమ్యం, ప్రయాణం పేర్లతో సినిమాలు వచ్చాయి. మేము కొత్తగా తీసుకొచ్చినవి ఏమీ లేవు. సినిమాలో రెండు పాత్రలు కూడా రచయితలే. ఆ పాత్రలు సహజసిద్ధంగా అలానే మాట్లాడుతాయి.
భాషను బతికించే శక్తి సినిమాకే ఉంది. సినిమాకి ఒక పవర్‌ ఉంది. ఎవరో ఒకరు ఆ భాష చూసి ఇష్టాన్ని పెంచుకోవచ్చు. నేను ఒక ప్రయత్నం చేశాను. ట్రైలర్‌ రిలీజ్‌ అయిన తర్వాత ఎంతోమంది అభినందిస్తూ సందేశాలు పంపారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన డిగ్నిటీ కోల్పోకుండా ఉండే అమ్మాయి ప్రయాణం ఇది. ప్రేమ రెండు దశల్లో జరుగుతుంది. 19 ఏళ్లలో జరిగే ప్రేమ, 27 ఏళ్ల వయసులో జరిగే ప్రేమలో తను మానసికంగా ఉన్న తేడాను చాలా సున్నితంగా ఎక్స్‌ప్లోర్‌ చేయాలని అనుకున్నాను. దానికి తోడు గురుశిష్య పరంపరను కూడా చూపించాలని అనుకున్నాను. అలాగే తన చుట్టుపక్కల పాత్రల నుంచీ తన క్యారెక్టర్‌ని ఎక్స్‌ప్లోర్‌ చేయాలని భావించాను. ఆ పాత్ర ఎన్ని కష్టాలు వచ్చినా మదుత్వాన్ని కోల్పోదు.
కశ్మీర్‌, కన్యాకుమారి, ఊటీ, ఆగ్రా.. ఇలా చాలా అద్భుతమైన లోకేషన్స్‌లో చిత్రీకరణ చేశాం. ‘మను’కి పని చేసిన విశ్వనాథ్‌ అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. మా నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -