నవతెలంగాణ-హైదరాబాద్: సెప్టెంబర్ 9వ తేదీన ఐరాస(ఐక్యరాజ్యసమితి) జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ ప్రారంభం కానుంది. ఈ సమావేశాలకు పీఎం మోడీ హాజరుకావడం లేదు. ఈసారి భారత్ ప్రతినిధిగా విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ వెళ్లనున్నారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ 23వ తేదీన మొదటిసారిగా ఐరాస జనరల్ అసెంబ్లీనుద్దేశించి మాట్లాడనున్నారు. జూలైలో విడుదల చేసిన జాబితాలో సెప్టెంబర్ 26వ తేదీన భారత్ నుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తారని ఐరాస విడుదల చేసిన జాబితా పేర్కొంది. తాజా లిస్ట్‌లో మాత్రం 27న భారత్ విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ప్రసంగిస్తారని ఉంది.
ఐరాస 80వ సెషన్ ఈసారి ‘బెటర్ టుగెదర్: 80 ఇయర్స్ అండ్ మోర్ ఫర్ పీస్, డెవలప్‌మెంట్, హ్యూమన్ రైట్స్’ఇతివృత్తంగా ఉంది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాలు కొనసాగుతున్న వేళ జరిగే ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.