Thursday, May 1, 2025
Homeతెలంగాణ రౌండప్మల్హర్ లో 81 శాతం ఉత్తీర్ణత.!

మల్హర్ లో 81 శాతం ఉత్తీర్ణత.!

– మండల టాపర్స్ సాత్విక,వైష్ణవి 
నవతెలంగాణ-మల్హర్ రావు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన10వ తరగతి వార్షిక పరీక్ష పలితాల్లో భాగంగా మండలంలో మొత్తం 152 మంది పరీక్షలకు హాజరు కాగా 127 మంది పాసై 81.6 శాతం ఉత్తీర్ణత సాధించారని మండల విద్యాధికారి లక్ష్మన్ బాబు తెలిపారు.మండల టాపర్స్ గా తాడిచెర్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న పన్నాల సాత్విక 526 మార్కులు,ఎడ్లపల్లి గ్రామంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న సిహెచ్ వైష్ణవి 526 మార్కులు,ఇదే పాఠశాలలో చదువుతున్న హారిక 506 మార్కులతో మండల ద్వితీయ టాపర్ గా నిలిచారు.తాడిచెర్ల హైస్కూల్లో 92 శాతం, పెద్దతూoడ్ల హైస్కూల్లో 100 శాతం,వళ్లెంకుంటవహస్కుల్లో 43 శాతం,మల్లారం హైస్కూల్లో 85 శాతం,దుబ్బపేటలోని కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలో 86శాతం,మోడల్ స్కూల్లో 79 శాతం ఉత్తీర్ణత సాధించారు.మండల టాపర్స్ గా వచ్చిన, పాసైన విద్యార్థులకు ఎంఈఓ,ఆయా పాఠశాలల ప్రాదానోపాధ్యాయులు,,ప్రిన్సిపాల్స్,పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.పెయిల్ అయిన విద్యార్థులు అధైర్య పదోవద్దని మళ్ళీ రాసి ఉత్తీర్ణత సాధించాలని మనోధైర్యం చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img