నవతెలంగాణ-పెద్దవూర : ప్రయివేటు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికిబస్సుకు బలైన విద్యార్థి ప్రాణం, పెద్దవూర శాంతినికేతన్ పాఠశాల ను సిజ్ చేయాలనిఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అకారపు నరేష్, ఎంఎస్ఎఫ్ జిల్లా కోఆర్డినేటర్ ముదిగొండ వెంకటేశ్వర్లు అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాల ముందు విద్యార్థి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నల్లగొండ పట్టణ కేంద్రంలో మాస్టర్ మైండ్ స్కూల్ ఘటన మరువక ముందే నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో ఉన్న శాంతినికేతన్ ప్రైవేట్ పాఠశాల లో మొదటి తరగతి చదువుతున్న విద్యార్థి బస్సు కిందపడి మరణించడం బాధాకరమన్నారు.
ప్రైవేట్ పాఠశాల యజమాన్యాల నిర్లక్ష్యానికి ఇది నిలువుటద్దంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవజ్ఞులైన వారిని పాఠశాల బస్సు నడిపే డ్రైవర్లుగా నియమించకపోవడం బస్సులో ఉండవలసిన గేట్ కీపర్ ఉండకపోవడంతో విద్యార్థులకు ప్రాణాలు పిట్టలా రాలిపోతున్నాని అన్నారు.జిల్లా కలెక్టర్ అన్ని ప్రైవేట్ పాఠశాలలు యాజమాన్యాలను స్వయంగా కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన ఫలితం లేకుండా పోయిందని తెలిపారు.ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు ఆడింది ఆట పడిందా పాట అన్నట్టు విద్యార్థుల ప్రాణాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బస్సులు నడుపుతున్నారని అన్నారు. డ్రైవర్ల సైతం విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ గురువారం పెద్దవూరలో ఉన్న విషయాన్ని బయటకు రాకుండా కప్పిపుచ్చి విద్యార్థుల ప్రాణాలను బేరసారాలతో నడిపిన శాంతినికేతన్ పాఠశాలకు గుర్తింపును రద్దుచేసి తక్షణమే పాఠశాలలను సీజ్ చేయాలని కోరారు. మరో ఏ పాఠశాలలో ఇలాంటి చిన్నారుల ప్రాణాలు గాలిలో కలవకుండా ఉండాలంటే జిల్లా కలెక్టర్ గారు తక్షణమే పెద్దవూర శాంతినికేతన్ పాఠశాలను సిజ్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి కి ఆదేశించాలని కోరారు.ఆ కుటుంబానికి25 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు జగదీష్ రమేష్,ఎంఆర్పీ ఎస్ అధ్యక్షుడు ఆదిమళ్ళ సత్యనారాయణ , జిల్లా సీనియర్ నాయకులు బొజ్జ చిన్న మాదిగ,కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు దొంతల నాగర్జున దోరేపల్లి మల్లయ్య, అజయ్, వర్షితు, నాగరాజు తదితరులు నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.