Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వార్డు సభ్యుల శిక్షణా తరగతులకు 86 మంది హాజరు

వార్డు సభ్యుల శిక్షణా తరగతులకు 86 మంది హాజరు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని రైతు వేదికలో వార్డు సభ్యుల రెండవ రోజు శిక్షణ తరగతులకు 86 మంది సభ్యులు హాజరైనారని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, ఎంపీవో మాట్లాడుతూ.. రెండవ రోజు శిక్షణలో వార్డు సభ్యులకు ముఖ్యంగా గ్రామపంచాయతీ విధులు నిధులు చేపట్టాల్సిన పనులు గ్రామపంచాయతీ చట్టాలు గురించి శిక్షణ తరగతులలో శిక్షకులు పెద్దగుల్లా సెక్రెటరీ నాగయ్య, హంగర్గా సెక్రెటరీ అశోక్ గౌడ్ మంగళవారం నాడు వార్డు సభ్యులకు అర్థమయ్యే విధంగా శిక్షణలో వివరించడం జరిగింది.

అదేవిధంగా వార్డు సభ్యుల గ్రామపంచాయతీలో నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలిపారు. గ్రామపంచాయతీలలో గ్రామసభలలో విధిగా పాల్గొనాలని అన్నారు. సభలో చేపట్టాల్సిన పనుల వివరాలను గ్రామస్తులకు వివరించి ప్రతి ఒక్కరూ సంబంధిత పనులను విషయాలను సమ్మతించే విధంగా తెలియచేసి తీర్మానాలు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరియు వార్డు సభ్యులకు చట్టాలపై అవగాహన కల్పిస్తే రాబోయే రోజులలో చేయవలసిన పనులను సులభంగా చేయవచ్చునని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము, దోస్తుపల్లి సర్పంచ్ మారుతి, చెండేగావ్ సర్పంచ్ లక్ష్మణ్, జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్,  11 గ్రామాల గ్రామపంచాయతీ కార్యదర్శులు , 86 మంది వార్డు సభ్యులు, మండల పరిషత్ కార్యాలయ అధికారులు అనిల్ కుమార్, గంగాధర్, ప్రవీణ్, భూమా గౌడ్, సృజన్, సిబ్బంది వీరేశం,  జుక్కల్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -