- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని ధర్మవరం బీసీ వసతిగృహంలో ఆహారం కలుషితమై 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతిగృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా… శుక్రవారం 110 మంది హాజరయ్యారు. రాత్రి భోజనాలయ్యాక 9 గంటల తర్వాత 86 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వసతిగృహం సిబ్బంది, పోలీసులు వారిని అంబులెన్స్‌లో గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థులు కోలుకుంటున్నట్లు కోదండాపురం ఎస్సై మురళి తెలిపారు.
- Advertisement -



