నవతెలంగాణ-హైదరాబాద్: 9/11 ఉగ్రదాడులు.. అమెరికా చరిత్రలోనే అతి పెద్ద దాడులు. హైజాక్ చేసిన నాలుగు విమానాలు అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో గల రెండు టవర్స్‌ను నాశనం చేశాయి. 2001లో జరిగిన ఈ దాడులలో 2,996 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో అమెరికాలో జాతీయ భద్రతా విధానాలు, ప్రజల జీవనశైలికి సుదీర్ఘ ప్రభావం చూపాయి. దాడులు జరిగి 24 ఏళ్లు అయిన సందర్భంగా న్యూయార్క్ నగరం వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఈ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేయర్ సాంప్రదాయంగా పాల్గొంటారు. కానీ ఈసారి మరిన్ని రాజకీయ ఒత్తిడులు ఉన్నందున ఎవరూ హాజరు కానున్నారన్నది క్లారిటీ లేదు. వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా నగరమంతా మౌనంగా ఉంటూ.. మరణించిన వారిని స్మరించుకుంటారు.
9/11 ఉగ్రదాడులు..నేటితో 24 ఏళ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES