నవతెలంగాణ-హైదరాబాద్: గాజాపై ఇజ్రాయిల్ అమానుషదాడులు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి నుండి ఆదివారం వరకు ఇజ్రాయిల్ చేపట్టిన దాడుల్లో తొమ్మిమంది మరణించారు. వారిలో అధికంగా మహిళలు, పిల్లలు ఉన్నారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. దక్షిణ నగరమైన ఖాన్‌యూనిస్‌లోని తాత్కాలిక శిబిరాలపై రెండు దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇద్దరు పిల్లలు సహా వారి తల్లిదండ్రులు మరణించారు. మూడవదాడిలో మరో పిల్లాడు మరణించాడని, మరో ఏడుగురు గాయపడ్డారని నాజర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ దాడులపై ఇజ్రాయిల్ స్పందించాల్సి వుంది. పదివారాలుగా గాజాలోకి సాయం వెళ్ల కుండా ఇజ్రాయిల్ అడ్డుకుంది. ఆహారం, మందులు మరియు ఇతర నిత్యావసరాలతో కూడిన దిగుమతులను రాకుండా అన్ని దారులను మూసివేసింది. ఆహార నిల్వలు తగ్గిపోతున్నాయని సహాయక బృందాలు పేర్కొన్నాయి. ఆకలితో అధికమంది మరణించవచ్చని హెచ్చరిస్తున్నాయి. సాయం అందేలా చూడాల్సిందిగా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి పెంచాలని ప్రపంచదేశాలను కోరుతున్నాయి.
గాజాలో 9మంది మృతి.. మహిళలు, పిల్లలే అధికం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES