Tuesday, April 29, 2025
Navatelangana
Homeఆటలు2028 నుంచి 94 మ్యాచులు

2028 నుంచి 94 మ్యాచులు

  • – ఐపీఎల్‌ చైర్మెన్‌ అరుణ్‌ సింగ్‌ ధుమాల్‌
    ముంబయి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మ్యాచుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీరియస్‌గా ఆలోచన చేస్తోంది. ప్రస్తుత ఐపీఎల్‌ మీడియా హక్కులు 2027తో ముగియనుండగా.. 2028 నుంచి మళ్లీ మీడియా హక్కుల వేలం ఉండనుంది. దీంతో 2028 ఐపీఎల్‌ నుంచి మ్యాచుల సంఖ్యను 94కు పెంచాలని బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌ అరుణ్‌ సింగ్‌ ధుమాల్‌ తెలిపారు. ఐపీఎల్‌లో ప్రస్తుతం 72 మ్యాచులు నిర్వహిస్తున్నారు. గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ ప్రాంఛైజీల రాకతో 2022 నుంచి మ్యాచుల సంఖ్య 60 నుంచి 74కు చేరుకుంది. 2025 నుంచి మ్యాచుల సంఖ్యను 84కు పెంచుతామని మీడియా హక్కుల వేలం సమయంలో బీసీసీఐ మాటిచ్చినా.. అంతర్జాతీయ షెడ్యూల్‌ ఇబ్బందితో అది సాధ్యపడలేదు. అయినా, ఐపీఎల్‌లో మ్యాచుల సంఖ్య పెంచేందుకు ఇటు ప్రసారదారులు, అటు బీసీసీఐ ఆలోచన చేస్తున్నాయి. ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌టీపీ) రానున్న రెండేండ్లకు మార్చి-మే సమయంలో ఐపీఎల్‌కు విండో కేటాయించింది. 2028 నుంచి ఐపీఎల్‌ రెగ్యులర్‌ ఫార్మాట్‌ హోమ్‌-అవే పద్దతిలో 94 మ్యాచుల టోర్నమెంట్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామనిఅరుణ్‌ సింగ్‌ ధుమాల్‌ తెలిపారు. సరైన సమయంలో.. ‘ఐపీఎల్‌ మ్యాచుల సంఖ్యను పెంచే అంశంలో ఐసీసీతో, బీసీసీఐలో చర్చలు జరుగుతున్నాయి. 74 నుంచి 94 కాకపోయినా.. తొలుత 84 మ్యాచులకు పెంచే ఆలోచన సైతం చేశాం. ప్రతి జట్టు ఇతర తొమ్మిది జట్లతో హోమ్‌, అవే ఫార్మాట్‌లో ఆడేందుకు 94 మ్యాచులు అవసరం. ఐసీసీ షెడ్యూల్‌ బిజీగా ఉంది. ఆసీస్‌ పర్యటన ముగియగానే, చాంపియన్స్‌ ట్రోఫీ.. ఆ వెంటనే ఐపీఎల్‌. ఈ ఏడాది 74 నుంచి 84 మ్యాచులకు పెంచటం అంత తెలివైన నిర్ణయం కాదని అనిపించింది. కానీ సరైన సమయంలో బీసీసీఐ ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటుంది. లీగ్‌లో ప్రాంఛైజీలను పెంచే ఆలోచన లేదు. సమీప భవిష్యత్‌లో ప్రాంఛైజీల సంఖ్య పెరిగే అవకాశం లేదు’ అని అరుణ్‌ అభిప్రాయపడ్డారు. గత రెండు సీజన్లుగా ఐపీఎల్‌లో మధ్యాహ్నం మ్యాచులు 12 షెడ్యూల్‌ చేశారు. టోర్నమెంట్‌ వ్యవధి పెంచకుండా.. మ్యాచుల సంఖ్యను పెంచితే అభిమానులకు ఆసక్తి సన్నగిల్లుతుంది. 94 మ్యాచుల ఐపీఎల్‌కు కనీసం మరో రెండు వారాలు అదనంగా కావాలి. ఐపీఎల్‌కు రెండున్నర మాసాల విండో ఇవ్వాలని ఐసీసీని బీసీసీఐ కోరనుంది. అదే జరిగితే సంతోషం ఐపీఎల్‌ ప్రతి ఏడాదికి ఎదుగుతోంది. అభిమానులు ఐపీఎల్‌ను ఇష్టపడటం సంతోషం. భారత్‌లో ప్రసారదారుల గణాంకాలు అసాధారణంగా ఉన్నాయి. 18వ సీజన్‌ను స్పెషల్‌ ఎడిషన్‌గా చూస్తున్నాం. 17 ఏండ్లలో ఐపీఎల్‌లో ఎంతో వృద్ది చెందింది. ఈ సీజన్‌లో కొత్త చాంపియన్‌ను చూడాలని అనుకుంటున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ అద్భుతంగా ఆడుతున్నాయి. ఈ జట్ల నుంచి ఫైనలిస్ట్‌లు వస్తే.. కచ్చితంగా మనం కొత్త చాంపియన్‌ను చూడగలం. కొత్త చాంపియన్‌ వస్తే ఐపీఎల్‌ పట్ల ఎంతో సంతోషిస్తానని అరుణ్‌ ధుమాల్‌ తెలిపాడు.

  • ముంబయి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మ్యాచుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీరియస్‌గా ఆలోచన చేస్తోంది. ప్రస్తుత ఐపీఎల్‌ మీడియా హక్కులు 2027తో ముగియనుండగా.. 2028 నుంచి మళ్లీ మీడియా హక్కుల వేలం ఉండనుంది. దీంతో 2028 ఐపీఎల్‌ నుంచి మ్యాచుల సంఖ్యను 94కు పెంచాలని బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌ అరుణ్‌ సింగ్‌ ధుమాల్‌ తెలిపారు. ఐపీఎల్‌లో ప్రస్తుతం 72 మ్యాచులు నిర్వహిస్తున్నారు. గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ ప్రాంఛైజీల రాకతో 2022 నుంచి మ్యాచుల సంఖ్య 60 నుంచి 74కు చేరుకుంది. 2025 నుంచి మ్యాచుల సంఖ్యను 84కు పెంచుతామని మీడియా హక్కుల వేలం సమయంలో బీసీసీఐ మాటిచ్చినా.. అంతర్జాతీయ షెడ్యూల్‌ ఇబ్బందితో అది సాధ్యపడలేదు. అయినా, ఐపీఎల్‌లో మ్యాచుల సంఖ్య పెంచేందుకు ఇటు ప్రసారదారులు, అటు బీసీసీఐ ఆలోచన చేస్తున్నాయి. ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌టీపీ) రానున్న రెండేండ్లకు మార్చి-మే సమయంలో ఐపీఎల్‌కు విండో కేటాయించింది. 2028 నుంచి ఐపీఎల్‌ రెగ్యులర్‌ ఫార్మాట్‌ హోమ్‌-అవే పద్దతిలో 94 మ్యాచుల టోర్నమెంట్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామనిఅరుణ్‌ సింగ్‌ ధుమాల్‌ తెలిపారు. సరైన సమయంలో.. ‘ఐపీఎల్‌ మ్యాచుల సంఖ్యను పెంచే అంశంలో ఐసీసీతో, బీసీసీఐలో చర్చలు జరుగుతున్నాయి. 74 నుంచి 94 కాకపోయినా.. తొలుత 84 మ్యాచులకు పెంచే ఆలోచన సైతం చేశాం. ప్రతి జట్టు ఇతర తొమ్మిది జట్లతో హోమ్‌, అవే ఫార్మాట్‌లో ఆడేందుకు 94 మ్యాచులు అవసరం. ఐసీసీ షెడ్యూల్‌ బిజీగా ఉంది. ఆసీస్‌ పర్యటన ముగియగానే, చాంపియన్స్‌ ట్రోఫీ.. ఆ వెంటనే ఐపీఎల్‌. ఈ ఏడాది 74 నుంచి 84 మ్యాచులకు పెంచటం అంత తెలివైన నిర్ణయం కాదని అనిపించింది. కానీ సరైన సమయంలో బీసీసీఐ ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటుంది. లీగ్‌లో ప్రాంఛైజీలను పెంచే ఆలోచన లేదు. సమీప భవిష్యత్‌లో ప్రాంఛైజీల సంఖ్య పెరిగే అవకాశం లేదు’ అని అరుణ్‌ అభిప్రాయపడ్డారు. గత రెండు సీజన్లుగా ఐపీఎల్‌లో మధ్యాహ్నం మ్యాచులు 12 షెడ్యూల్‌ చేశారు. టోర్నమెంట్‌ వ్యవధి పెంచకుండా.. మ్యాచుల సంఖ్యను పెంచితే అభిమానులకు ఆసక్తి సన్నగిల్లుతుంది. 94 మ్యాచుల ఐపీఎల్‌కు కనీసం మరో రెండు వారాలు అదనంగా కావాలి. ఐపీఎల్‌కు రెండున్నర మాసాల విండో ఇవ్వాలని ఐసీసీని బీసీసీఐ కోరనుంది. అదే జరిగితే సంతోషం ఐపీఎల్‌ ప్రతి ఏడాదికి ఎదుగుతోంది. అభిమానులు ఐపీఎల్‌ను ఇష్టపడటం సంతోషం. భారత్‌లో ప్రసారదారుల గణాంకాలు అసాధారణంగా ఉన్నాయి. 18వ సీజన్‌ను స్పెషల్‌ ఎడిషన్‌గా చూస్తున్నాం. 17 ఏండ్లలో ఐపీఎల్‌లో ఎంతో వృద్ది చెందింది. ఈ సీజన్‌లో కొత్త చాంపియన్‌ను చూడాలని అనుకుంటున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ అద్భుతంగా ఆడుతున్నాయి. ఈ జట్ల నుంచి ఫైనలిస్ట్‌లు వస్తే.. కచ్చితంగా మనం కొత్త చాంపియన్‌ను చూడగలం. కొత్త చాంపియన్‌ వస్తే ఐపీఎల్‌ పట్ల ఎంతో సంతోషిస్తానని అరుణ్‌ ధుమాల్‌ తెలిపాడు.
RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు