Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణిలో 96 దరఖాస్తులు..

ప్రజావాణిలో 96 దరఖాస్తులు..

- Advertisement -

–   జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నవతెలంగాణ –  కామారెడ్డి  : కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివిధ సమస్యలపై వచ్చిన ఆయా శాఖలకు సంబంధించిన 96 అర్జీలను అర్జీదారుల నుండి స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణి లో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు.   ప్రజావాణి లో  అసిస్టెంట్ కలెక్టర్ ( లోకల్ బాడీ )  మధుమోహన్, సీఈఓ చందర్, ఆర్డీవో వీణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -