Saturday, March 14, 2026
E-PAPER
Homeబీజినెస్మూడు గంటల్లోనే 96 శాతం క్లెయిమ్‌ల పరిష్కారం

మూడు గంటల్లోనే 96 శాతం క్లెయిమ్‌ల పరిష్కారం

- Advertisement -

– తెలుగు రాష్ట్రాల్లో రూ.1,150 కోట్ల చెల్లింపులు : స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌
హైదరాబాద్‌ :
ప్రయివేటు రంగంలోని ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తెలుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరి స్తోన్నట్లు తెలిపింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ హోల్‌టైం డైరెక్టర్‌ హిమాన్షు వాలియా, ఎపి, టిఎస్‌ బిజినెస్‌ హెడ్‌ కెబిబి శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇప్పటి వరకు ఈ రెండు రాష్ట్రాల్లో సుమారు రూ.1,150 కోట్ల విలువైన 1.7లక్షల క్లెయి మ్‌లను సంస్థ పరిష్కరించిం దని హిమాన్షు తెలిపారు. ఇందులో 96శాతం నగదు రహిత (క్యాష్‌లెస్‌) క్లెయిమ్‌ల ను కేవలం మూడు గంటల్లోపే సెటిల్‌ చేసి బాధితులకు అండ గా నిలిచామన్నారు. ప్రతీ ఏడాది వైద్య ద్రవ్యోల్బణం 12 శాతం పెరుగుతోందన్నారు. ఆరోగ్య బీమా అనేది ఇప్పుడు కేవలం ఆసుపత్రి ఖర్చులకే కాకుండా కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి భరోసా ఇచ్చే ఒక ముఖ్యమైన భాగస్వామిగా మారిందన్నారు. ప్రస్తుతం తమ సంస్థ ఈ రెండు రాష్ట్రాల్లో 24 లక్షల మందికి పైగా బీమా రక్షణ కల్పిస్తుందన్నారు. 1,800 నెట్‌ వర్క్‌ ఆస్పత్రులు, 89,000 మంది అడ్వైజర్ల ద్వారా సేవలు అందిస్తోందన్నారు. రెండు రాష్ట్రాల్లో 19 శాతం వ్యాపార వృద్ధిని సాధిస్తున్నామన్నారు. 2024 -25లో రూ.15,048 కోట్ల వ్యాపారం జరగ్గా.. 2025-26 ఫిబ్రవరి నాటికి రూ.1,990 కోట్లకు పెరిగిందన్నారు. మొత్తం కంపెనీ ఆదాయంలో తెలుగు రాష్ట్రాల వాటా 10 శాతంగా ఉందన్నారు. కేవలం నగరాలకే పరిమితం కాకుండా టైర్‌-2, టైర్‌-3 పట్టణాల్లోనూ బీమాపై అవగాహన పెరుగుతోందని కెబివి శ్రీనివాస్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -