నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని రైతు వేదికలో 11 గ్రామ పంచాయతీలకు సంబంధించిన 96 మంది సభ్యులకు వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ మరియు ఎంపీ ఓ రాము తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో & ఎంపీవో అధికారులు మాట్లాడుతూ .. మొదటిరోజు శిక్షణ తరగతులకు గాను బంగారుపల్లి, బిజ్జల్ వాడి, బస్వాపూర్, చండే గావ్, చిన్నగుల్లా, డోన్ గావ్, దోస్తు పల్లి , పెద్ద ఏడ్గి , చిన్న ఏడ్గి , పెద్ద గుల్లా, గుల్లా తాండ గ్రామ పంచాయతీల అన్ని వార్డు మెంబర్లకు శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగిందని అన్నారు.
ఈ శిక్షణ తరగతిలో శిక్షకులుగా నాగయ్య జిపి కార్యదర్శి గుల్లా తండా, అశోక్ గౌడ్ హంగర్గా, నవీన్ , దయాకర్ , వార్డు సభ్యులకు అర్థమయ్యే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు. నేటి శిక్షణ తరగతులు కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులు క్రమశిక్షణగా ఉండాలని అన్నారు. మహాత్మా గాంధీ పేర్కొన్నట్టుగా గ్రామ స్వరాజ్యమే దేశ అభివృద్ధి అని తెలిపారు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించి సుభిక్షంగా ఉండాలంటే అభివృద్ధి అనేది గ్రామపంచాయతీ స్థాయి నుంచి జరగాలి అని అన్నారు.
అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అని సూచించారు. అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తున్నదని ఈ అవకాశాన్ని స్థానిక ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామీణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఇటీవలై ఎన్నికైన మీపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అని తెలిపారు. ప్రభుత్వం కూడా మీ సమర్థత , చిత్తశుద్ధిపై నమ్మకంతో ఉంది మీరు ప్రజాప్రతినిధిగా విధులు మరియు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడానికి సహకరించే విధంగా ఈ శిక్షణ తరగతులు ఎంతో దోహద పడతాయని అన్నారు.



