నవతెలంగాణ-కంఠేశ్వర్ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజులలో డ్రంకన్ డ్రైవ్ కేసులు 97 నమోదు కాగా సంబంధిత కోర్టులు 9,40,000/- జరిమానా విధించారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరిగింది. అంందులో భాగంగా తేది:2-2-2026 నుండి తేది 6-2-2026 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 97 కేసుల నమోదు చేయడం జరిగింది. విరినందర్నీ సంబంధిత కోర్టులలో 97 మందికి కోర్టు లో హాజరు పరచగా వీరికి రూ: 9,40,000/- జరిమానా విధించడం జరిగింది. ఇందులో 3 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదు. వాహనాదారులు వాహనానికిసంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోగలరు.
వారం రోజుల్లో 97 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



