- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కన్నడ కమెడియన్, బిగ్‌బాస్-7 కంటెస్టెంట్ రాజు తాలికొటే మరణించారు. నిన్న అర్ధరాత్రి గుండెపోటుకు గురైన ఆయనను కర్ణాటకలోని ఉడుపి మణిపాల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మనసారె, పంచరంగి, లైఫ్ ఈజ్ దట్, రాజ్‌ధాని, మైనా, టోపీవాలా వంటి చిత్రాల్లో ఆయన నటించారు. BB-7లో పాల్గొనడంతో పాటు పలు టీవీ సీరియళ్లలోనూ సందడి చేశారు. రాజు మృతి పట్ల కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ సంతాపం తెలిపారు.
- Advertisement -