Tuesday, May 13, 2025
Homeజాతీయందళాల దెబ్బ రావల్పిండికి తెలిసొచ్చింది

దళాల దెబ్బ రావల్పిండికి తెలిసొచ్చింది

- Advertisement -

– సరిహద్దు స్థావరాల పైనే చర్యలు తీసుకోలేదు..
– పాక్‌, పీఓకేలోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
న్యూఢిల్లీ:
భారత దళాల శక్తి ఏ పాటిదో రావల్పిండిలోని పాకిస్తాన్‌ సైనిక ప్రధాన కార్యాలయానికి తెలిసొచ్చిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం రాజ్‌నాథ్‌ ఈ వ్యాఖ్య చేశారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొన్నది. లక్నోలోని ఉత్తరప్రదేశ్‌ రక్షణ పారిశ్రామిక కారిడార్‌లో బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి తయారీ యూనిట్‌ ప్రారంభ కార్యక్రమానికి రాజ్‌నాథ్‌ వర్చువల్‌గా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ… సరిహద్దుకు రెండు వైపులా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నూతన భారత్‌ సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారని తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఉద్దేశం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం మాత్రమే కాదనీ, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై ప్రపంచానికి సందేశమివ్వడం కూడా అని చెప్పారు. భారత సాయుధ దళాలు ధైర్య సాహసాలను మాత్రమే ప్రదర్శించలేదనీ, పాక్‌పై చర్యల విషయంలో సంయమనం కూడా పాటించాయని అన్నారు. ”మేము సరిహద్దు పక్కన ఉన్న స్థావరాలపై మాత్రమే చర్యలు చేపట్టలేదు. భారత సైనిక దళాల దెబ్బల శబ్దం పాకిస్తాన్‌ సైనిక దళాల ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండి కూడా విన్నది” అని ఆయన వ్యాఖ్యానించారు. పాక్‌, పాక్‌ ఆక్రమితక కాశ్మీర్‌ (పీఓకే)లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపామన్నారు. పౌరులకు హాని కలిగించలేదని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -