నవతెలంగాణ – హైదరాబాద్ : జంట నగరాల పరిధిలో ఇటీవల ప్రభుత్వం 1.54 లక్షల తెల్ల రేషన్‌కార్టులను మంజూరు చేసి విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అయితే, జులైలో మొదటి దశగా కార్డులు జారీ చేసిన సర్కార్ ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు కార్డులను మంజూరు చేసింది. నగర వ్యాప్తంగా సుమారు 6 లక్షల దరఖాస్తులు రాగా 1,54,276 కుటుంబాలను అర్హులుగా గుర్తించి కార్డులను జారీ చేశారు. అయితే, ఈ కార్డుల ద్వారా 5.77 లక్షల మందికి లబ్ధి కలగనుంది. కొత్తగా మంజూరైన కార్డులకు నవంబరు నుంచి రేషన్ పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త కార్డులకు 3,463 టన్నుల బియ్యం అవసరం అవుతాయని అంచనా వేశారు.
కొత్త రేషన్‌కార్డుదారులకు వచ్చే నెల నుంచి రేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES