నవతెలంగాణ-హైదరాబాద్: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు, పచ్చి మితవాది జైర్ బోల్సనారోకి గృహనిర్బంధం విధించినట్లు సుప్రీంకోర్టు జడ్జి అలెగ్జాండ్రే మోరేస్ సోమవారం తీర్పు ఇచ్చారు. 2022లో తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికవడంలో విఫలమైన తర్వాత కుట్ర పన్నేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలకు సంబంధించి నిషేధ ఉత్తర్వులను పాటించడంలో విఫలమైనందుకు బోల్సనారో ఈ ఏడాది ఆగస్టు నుండి గృహనిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. మరో కేసులో బోల్సనారో దోషిగా నిర్ధారణకావడంతో, గత నెలలో 27 సంవత్సరాల మూడు నెలల జైలుశిక్ష విధించబడింది. బోల్సనారోను గృహనిర్బంధం నుండి విడుదల చేయాలని ఆయన న్యాయవాదుల బృందం అభ్యర్థించింది. నిర్బంధానికి దారితీసన దర్యాప్తులో ఆయనపై ఎటువంటి అభియోగం నమోదు కాలేదని పేర్కొంది. అయితే ప్రతివాదుల వాదనలను జస్టిస్ మోరెస్ తోసిపుచ్చారు. బోల్సనారో గృహనిర్బంధం ”ఆవశ్యకం మరియు సముచితం” అని జస్టిస్ మోరెస్ పేర్కొన్నారు.
బోల్సనారోకు గృహనిర్బంధమే సముచితం: జస్టిస్ మోరెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES