నవతెలంగాణ-కంఠేశ్వర్
స్థానిక సంస్థల్లో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వదలచిన 42% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొందరు అగ్రవర్ణాల వారు కేసు వేసి స్టే తప్పియడంతో బీసీ బిడ్డల నోటికాడి ముద్ద దూరమైందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం కేర్ డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బీసీలకు న్యాయంగా దక్కవలసిన 42 శాతం రిజర్వేషన్లను కొందరు అగ్రవర్ణాల వారు కుట్రలతో నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈనెల 18న రాష్ట్రవ్యాప్త బందుకు రాష్ట్ర బీసీ జేఏసీ ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. వారి పిలుపుమేరకు ఈనెల 18వ తేదీ నాడు అందరూ పార్టీలకతీతంగా, కులాలకు అతీతంగా అన్ని వ్యాపార సంస్థలు బందు పెట్టి సహకరించాలని నరాల సుధాకర్ విన్నపం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నరాల సుధాకర్ తో పాటు బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, పోల్కం గంగ కిషన్, కరిపె రవీందర్, దర్శనం దేవేందర్, సత్య ప్రకాష్, కొయ్యాడ శంకర్, శ్రీలత, చంద్రమోహన్, విజయ్, బసవసాయి, వాసం జయ, రుక్మిణి, బాలన్న తదితరులు పాల్గొన్నారు.
బీసీ బందును పార్టీలకు అతీతంగా విజయవంతం చేద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES