నవతెలంగాణ-హైదరాబాద్: సీనియర్ అధికారుల కులవేధింపుల కారణంగా ఇటీవల ఐపీఎస్ అధికారి వై.పూరన్ కుమార్ తన సర్వీస్ రివ్వాలర్‌తో సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ కపూర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజీపీ(Haryana DGP) శత్రుజీత్ కపూర్‌ను ప్రభుత్వం లీవ్‌పై పంపింది. ప్రస్తుతానికి ఓంప్రకాశ్ సింగ్‌కు ఆ రాష్ట్ర డీజేపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆ ఆత్మహత్య కేసులో నమోదు అయిన ఎఫ్ఐఆర్‌లో శత్రుజీత్ కపూర్ పేరు కూడా ఉన్నది. రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాను కూడా మార్చుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కపూర్‌ను లీవ్‌పై పంపినట్లు సీఎం మీడియా సలహాదారుడు రాజీవ్ జైట్లీ వెల్లడించారు. ఐపీఎస్ పూరన్ కుమార్ తన సూసైడ్ నోట్‌లో పలువురు ఆఫీసర్ల పేర్లను ప్రస్తావించారు. దాంట్లో కపూర్, బిజార్నియాతో పాటు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నట్లు విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. హర్యానాలోని బీజేపీ సర్కారు డీజీపీని మార్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.