Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెరవే ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం జయంతి

తెరవే ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం జయంతి

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
భారత మాజీ రాష్ట్రపతి,  క్షిపణి శాస్త్రవేత్త,  భారతరత్న అవార్డు గ్రహీత, భారతదేశం గర్వించదగ్గ రచయిత ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా తెరవే కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గఫూర్ శిక్షక్, మోహన్ రాజ్ లు ఒక ప్రకటనలో తెలిపారు. సాయం ప్రాచ్య కళాశాల ఓరియంటల్ కళాశాల పక్కన గల రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల  సంక్షేమ  సంఘ భవనంలో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కవుల కవితాగానాలు ఉంటాయని, అధిక సంఖ్యలో కవులు రచయితలు అభిమానులు ఈ కార్యక్రమానికి  హాజరై విజయవంతం చేయాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -