Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు 

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు 

- Advertisement -

నవతెలంగాణ – పెబ్బేరు 
అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు పెబ్బేరు మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్నటువంటి పశువులు,  గేదెలకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అని పశుసంవర్ధక శాఖ అధికారి విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున పాడి పశువులు, గేదెలు కలిగినటువంటి రైతు సోదరులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు. 3 నెలల వయస్సు  పైబడిన అన్ని పశువులు,  గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పకుండా ఇప్పించగలరని రైతులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భాగంగా బుధవారం శాఖాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు చేయడం జరుగుతుంది అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -